ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది- కేటీఆర్ 17 h ago

featured-image

TG : భాగ్యనగరానికి బ్రాండ్ ఇమేజ్‌తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చేందుకే ఫార్ములా ఈ-రేస్ ను ఎంతో కష్టపడి రాష్ట్రానికి తీసుకొచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 'ఎక్స్'లో కేటీఆర్ పోస్ట్ చేశారు."ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్ ను గమ్యస్థానంగా మార్చడమే ఎజెండాగా ఫార్ములా ఈ రేస్ ను తీసుకొచ్చామన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్, తయారీ రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణతో ఈ-మొబిలిటీ వీక్ ద్వారా రూ.12 వేల కోట్ల పెట్టబడులు ఆకర్షించగలిగామన్నారు. నీచమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఈ అంశం అర్థం కాలేదని పేర్కొన్నారు. కానీ.. విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసు అని చెప్పారు. మా ప్రభుత్వ విజన్, నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారన్నారు. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది" అని కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD